Tuesday, November 26, 2024

TS : నీళ్ల సమస్య ఊర్లలో రావద్దు… మంత్రి పొన్నం

ఊర్లలో నీళ్ల సమస్య రావద్దని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని అన్నారు.

వర్షాలు పడక కరువు వస్తే కాంగ్రెస్ కరువు తెచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.బిందె పట్టుకుని బయటకు వచ్చే సమస్య రావద్దని సూచించారు. నీళ్ల సమస్య రాకుండా నియోజకవర్గానికి 3.5 కోట్లు తీసుకొచ్చామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులున్న తనకు చెప్పవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

- Advertisement -

పాఠశాలల్లో కిచెన్, టాయిలెట్స్ పూర్తి చేయాలని సూచించారు. విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం లాగా కేంద్రంతో కోట్లాడే వాళ్ళం కాదని వాళ్ల దగ్గర నిధులు తీసుకొస్తామని చెప్పారు. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి కేంద్రం సహకరించాల్సిందే అని తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు ,500 కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement