పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల మోతను వినియోగదారులను మోయలేకపోతున్నారు. అలాంటి సమయంలో పెట్రోల్ ను కల్తీ చేస్తే వినియోగదారుల ఊరుకుంటారా? తమ తడాఖా చూపించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఇండియన్ ఆయిల్ సంగమేశ్వర పెట్రోల్ పంపులో ఓ కస్టమర్ బండిలో రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించుకోని వెళ్లిన కొద్ది సేపటికే బండి ఆగిపోయింది..దీంతో ఆ యువకుడు మళ్ళీ వచ్చి వాటర్ బాటిల్ లో పెట్రోల్ వేయమన్నాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాటిల్ లో నీళ్లతో కూడిన పెట్రోల్ ఉండడంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు పెట్రోల్ పంపు యాజమాన్యంపై దాడి చేశారు. ఈ సంఘటన నారాయణఖేడ్ ఇండియన్ ఆయిల్ శ్రీ సంగమేశ్వర పెట్రోల్ పంపులో చోటు చేసుకుంది.
‘’నీళ్లు కలిపిన పెట్రోల్ ను బైక్ లో పోస్తే బండి స్టార్ట్ అవుతుందా అసలు. వాహనాల ఇంజిన్లు ఖరాబు అయిపోవాల్సిందే. పది రూపాయల కక్కుర్తి కోసం వేలు, లక్షలు పోసి కొనుక్కున్న వాహనాలను పక్కన పెట్టాల్సిందేనా?’’ అంటూ వినియోగదారుడు రెచ్చిపోయాడు. పెట్రోల్ పంపు సిబ్బందిపై దాడి చేశాడు.