Friday, November 22, 2024

Water Management – తెలంగాణాకు మ‌రో మూడు జాతీయ అవార్డులు …

న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రవిజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఉత్తమ నీటి విధానాలను అవలంభించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ గా ఎంపికైంది. ఈ నాలుగో జాతీయ నీటి అవార్డులను కేంద్ర జలశక్తి శాఖ నేడు ప్రకటించింది. అలాగే ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్​ జిల్లాకు మూడో స్థానం దక్కింది. ఉత్తమ సంస్థల విభాగంలో హైదరాబాద్​లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయానికి రెండో స్థానం లభించింది. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్ భవన్​లో జరగనున్న కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు.

మొత్తం 11 విభాగాల్లో 41 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం జిల్లా ఎంపికైంది. ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్. బిహార్​తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి కేజీబీవీ పాఠశాల ఉత్తమ పాఠశాలలుగా రెండో స్థానం సంపాదించింది. ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సీసీఎల్ ప్రొడక్ట్స్ మూడో స్థానంలో నిలవగా , ఉత్తమ ఎన్జీవోగా అనంతపూర్​కు చెందిన అక్కియాన్ ఫ్రాటెర్నా ప్రోత్సాహక బహుమతి దక్కించుకుంది.

అలాగే తెలంగాణలో అడవుల పెరుగుదల, మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి వంటి తదితర పర్యావరణహిత కార్యక్రమాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున శాస్త్ర పర్యావరణ కేంద్రం- సీఎస్​ఈనే స్వయంగా స్టేట్ ఆఫ్ స్టేట్ ఎన్విరాన్​మెంట్ పేరుతో నివేదకను విడుదల చేసింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో 7,213 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానంలోనూ రాజస్థాన్ చివరి స్థానంలోనూ నిలిచింది.
Dailyhunt

Advertisement

తాజా వార్తలు

Advertisement