Wednesday, January 15, 2025

Water Dispute – కృష్ణా జలాల్లో మేజ‌ర్ షేర్ – ట్రిబ్యునల్ లో వాదన వినిపిస్తామన్న ఉత్త‌మ్

హైద‌రాబాద్ – కృష్ణ ట్రిబ్యునల్ పై గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టు లో వాదనలు జరగనున్నాయి. న్యాయస్థానంలో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ప్రతిపాదనకు సూచనప్రాయంగా ఒప్పుకున్నారని, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని మంత్రి అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదన్నారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టీఎంసీలు కేటాయించారని, అందులో మెజార్టీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జ‌లాల‌పై అధిక హ‌క్కులు త‌మ‌కే ఉన్నాయ‌నే వాద‌న‌ను ట్రిబ్యున‌ల్ లో వాదించనున్నట్లు తెలిపారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement