Saturday, January 4, 2025

Warns – అతి చేశారో… వాచిపోద్ది – న్యూఇయ‌ర్ వేళ జంట‌న‌గ‌రాల‌లో ఆంక్ష‌లు

న్యూఇయ‌ర్ వేళ ఆంక్ష‌లు
జంట‌న‌గ‌రాల‌లో నేటి రాత్రి నుంచి ఫ్లై ఓవ‌ర్లు మూసివేత‌..
న‌గ‌రంలో అడ‌గ‌డుగునా చెక్ పోస్ట్ లు
తాగి డ్రైవ్ చేస్తే పదివేల‌తో వాత‌.. ఆరు నెల‌లు జైలు
రోడ్డుపై మ‌ద్యం తాగినా… కేక్ క‌ట్ లు చేసినా క‌ట‌క‌టాలోకే..
డిజెలు, అధిక శ‌బ్దావ‌చ్చేబాక్స్ లు వినియోగిస్తే సీజ్
హ‌ద్దు దాట‌వ‌ద్దంటూ పోలీసుల వార్నింగ్

హైద‌రాబాద్ – నూతన సంవత్సరం వేడుకలను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించుకోవాల‌ని ప్ర‌జ‌లకు పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.. ఈ వేడుక‌ల‌లో డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్స్ లు వినియోగిస్తే ఉపేక్షించేది చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.. నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజల శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. రోడ్ల‌పై మ‌ద్యం సేవించ‌డం, వేడుక‌లు నిర్వ‌హించ‌డం చేస్తే నేరుగా క‌ట‌క‌టాల వెన‌క్కి పంపుతామ‌మ‌ని పోలీస్ బాస్ స్ప‌ష్టం చేశారు. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు కుటుంబ స‌భ్యుల‌తో నిర్వహించుకోవాలని కోరారు.

- Advertisement -

రాత్రి 11 నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ సమయంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలలో, మూడు కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయడం, బేగంపేట్ టోవ్లీచౌకి ఫ్లైఓవర్ సహా ఇతర ఫ్లైఓవర్లను కూడా మూసివేయడంచేయనున్నారు. అయితే, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పై ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. అలాగే, ఔటర్ రింగ్ రోడ్డుపై హెవీ వెహికిల్స్ మాత్రమే రాగలిగే అవకాశం ఉంటుంది.

280 చెక్ పోస్ట్ లు

పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 280 కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, 120 కి పైగా డ్రగ్ డిటెక్షన్ కిట్‌లను కూడా ఉపయోగించడానికి సిద్ధం చేశారు. తెలంగాణా నార్కోటిక్‌ బ్యూరో, తెలంగాణా పోలీసులు, ఇంకా ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు కూడా జరుగనున్నాయి. ఈ దాడుల కోసం 40 టీమ్‌లను సిద్ధం చేసినట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.

డంకెన్ డ్రైవ్ లో చిక్కితే అంతే సంగ‌తులు..

ఇక డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తులకు పదివేలు రూపాయల వరకు జరిమానా విధించనున్నారు . ఇంకా మితిమీరితే ఆరు నెల‌ల జైలు శిక్ష కూడా విధించ‌నున్నారు..మరోవైపు రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్లకు అనుమతి ఇచ్చారు. అయితే ఎవరైనా ఒంటిగంట తర్వాత ఈవెంట్లను కొనసాగించినట్లయితే, నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ చర్యలు నగరంలో పర్యాటకులు, ట్రాఫిక్ భద్రత కోసం తీసుకుంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement