Friday, November 22, 2024

Warns – రేవంత్ ను విమ‌ర్శిస్తే నాలుక కోస్తా .. బీఆర్ఎస్ నేత‌లకు జ‌గ్గారెడ్డి వార్నింగ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పనికిరాని వాడు అంటే.. కేటీఆర్ కానీ, వాళ్ల‌ అయ్య కేసీఆర్ ని అయినా సరే నాలుక కోస్తం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్ లో ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ, త‌మ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టకండి అన్నారు.


బీఆర్ఎస్ వాళ్లు అనవసర రచ్చ చేస్తూ హైదరాబాద్ ప్రజల మూడు ఖరాబ్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి పెట్టి ఖైరతాబాద్ వినాయకుడి పూజ‌ల‌ను టీవీల్లో చూడకుండా చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వినాయకుడి సేవలో పోలీసులుంటే హరీష్, కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు రోడ్డుమీదకు వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నార‌ని అన్నారు.

- Advertisement -

ఇక ఆంధ్రా ఎంఎల్ఏ లను పార్టీలోకి తీసుకున్నది మీరేన‌ని, వాళ్ల చేపల పులుసు తిన్నది మీరేనని కేసీఆర్ పై మండిప‌డ్డారు. పవర్ పోయే సరికి నిద్ర పట్ట‌క.. క‌ల్లు తాగిన కోతి లెక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎగిరెగిరి ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2014 నుంచి 2018 వరకు ఎంపీ లు నలుగురు.. 25 ఎంఎల్ఏ ..18 మంది ఎమ్మెల్సీ లను పార్టీలో చేర్చుకుంది కేసీఆర్ అని జ‌గ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయిన త‌ర్వాత రాజకీయాల్లో ఎథిక్స్ పోయాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement