కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 12.580 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భక్తులు నదిలోకి స్నానాల కోసం దిగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. అధికారులు బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,99,550 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజీ లోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 60,900 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement