Tuesday, July 2, 2024

Warngal – రేవంత్ ప‌ర్య‌ట‌న‌పై బిఆర్ఎస్ నేత‌ల గ‌రం గ‌రం …ఒక్క పైసా కూడా కేటాయించ‌క‌పోవడంపై ఆగ్ర‌హం

హ‌నుమ‌కొండ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు రావడం సంతోషమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆజాం జాహి మిల్లును మూసివేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై హన్మకొండ :బాలసముద్రంలోని పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దాస్యం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ కు పూర్వవైభవం తీసుకొని రావ‌డానికి.. మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏదో విధంగా వంకలు పెట్టి అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. భారాస నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, . సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపట్ల ఆయన స్వంతపార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు. ఆయన్ను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని., ఆయన సిఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని, 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సిఎం కు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.

38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన అని ఆయన అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అంటూనే.. మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా…? అంటూ ప్రశ్నించారు.

కేబినెట్ లో ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన నిర్ణయాలను స్వాగతిస్తున్నారని., ఆయనపై స్వంత పార్టీలో ధిక్కారం పెరిగి పోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పెంచుకోవడం కోసం బిఆర్ఎస్ ఎంఎల్ఏ లను గుంజుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందిని., గంటకో హత్య జరుగుతుందంటూ.. రాష్ట్రంలో పాలన పట్టు తప్పిందంటూ ఆయన తెలిపారు.అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలపై ఈ ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement