భువనగిరి – సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 49వ రోజు భువనగిరి పట్టణానికి చేరుకోవడంతో 600 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఫిషర్స్ మ్యాన్ సెక్రెటరీ బుజ్జి శత్రురావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో గదను బహూకరించి ఘనంగా సన్మానం చేశారు.మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి ,హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్గన్పూర్, జనగామ, ఆలేరు, నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో పాదయాత్ర పూర్తిచేసుకున్నారు.
భువనగిరిలో పీసీసీ జనరల్ సెక్రెటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్, పీసీసీ సభ్యులు తంగేళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బిస్కుంట్ల సత్యనారాయణ తదితరులు ఇందిరమ్మ కాలనీ వద్ద భట్టి విక్రమార్క పాదయాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ మాట్లాడారు. రైతుల, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.––———