ఆలేరు – తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావడానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ కు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులోని కాకతీయ కళాతోరణం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా గుండ్లగూడెం గ్రామంలోకి అడుగు పెట్టింది. జిల్లాలోకి అడుగుపెట్టిన పాదయాత్ర రథసారథి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పిసిసి జనరల్ సెక్రెటరీ బీర్ల ఐలయ్య, పిసిసి ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్, ఆలేరు నియోజకవర్గ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి, పిసీసీ మాజీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, కోఆర్డినేటర్ నీల పద్మ, పీసీసీ జనరల్ సెక్రెటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్, పిసీసీ సభ్యులు తగళ్లపల్లి రవికుమార్, అండెం సంజీవరెడ్డి, బోళ్ల కొండల్ రెడ్డి, శ్రీశైలం, రాజు తదితరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
గజమాలలతో ఘనంగా సన్మానించి, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై భట్టి అడుగులో అడుగేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. నాయకులు, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. దారి పొడవున ఒగ్గు, డోలు కళాకారులు తమ ఆట-పాట విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. కాకతీయ కళాతోరణం చేరుకోగానే భారీ వర్షం కురవడంతో వర్షంలోనే నడుస్తూ విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించారు. సుమారు నాలుగు కిలోమీటర్లు వర్షంలోనే నడుస్తూ పాద యాత్రను కొనసాగించారు