Thursday, November 21, 2024

ధాన్యం నిల్వల కోసం గోదాములు నిర్మాణం-ఎమ్మెల్యే దాసరి

రైతాంగం కష్టించి పండించిన ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపడుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, టేస్కాబ్ చైర్మన్ కొండూరీ రవీందర్రావు లు పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం లోని కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 35,65,500రూపాయలతో నిర్మించ తలపెట్టిన గోదాం నిర్మాణానికి, ఓదెల మండలం పొట్లపల్లి లో 63 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన గోదాము, సహకార సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ..రైతాంగం శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చందు లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, ఛైర్మెన్ లు చదువు రామచంద్రారెడ్డి,గజావెల్లి పురుషోత్తం, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య,రైతు బంధు మండలాధ్యక్షుడు నిదనపురం దేవయ్య, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష-అనిల్,వైస్ ఛైర్మెన్ కామిడి సంధ్య-వెంకట్ రెడ్డి,సర్పంచ్ ఆడెపు శ్రీదేవి-రాజు, ఎంపీటీసీ పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement