Saturday, November 23, 2024

ధరలు తగ్గించేంత వరకు పోరాటం

దేశంలోని పేద మధ్య తరగతి ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెనుభారం మోపుతుందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆరోపించారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపుకు నిరసనగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద పార్టీ శ్రేణులు, మహిళతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబోమ్మను దగ్దం చేసి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డు,అదుపు లేకుండా పెంచుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చన తర్వాత నుండి డీజిల్, పెట్రోలు,గ్యాస్ ధరలను విపరీతంగా ధరలు పెరగడం వలన నిత్యావసర సరుకుల ధరలు రవాణా ఖర్చులు వీపరీతంగా పెరుగుతాయన్నారు. వీటన్నింటి ధరలు పెంచేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ అని అన్నారు. సామాన్యుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వర్దన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement