వరంగల్‌కు చెందిన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్(కేఐటీఎస్) ఇటీవల డ్రైవర్‌లెస్ ఆటోనమస్ ట్రాక్టర్ ను డెవలప్ చేసింది. డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ భూమిని దున్నేస్తోంది. దానికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే ఆ ట్రాక్టర్‌ను డెవలప్ చేసిన తీరు తనను ఎంతో ఇంప్రెస్ చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం ఇలాగే ఉంటుందని ఆ వీడియోను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో కామెంట్ చేశారు. సమాజంపై ప్రభావం చూపే ఆవిష్కరణలకు చెందిన ఐడియాలు, ఉత్పత్తులతో యువత ముందుకు రావాలని మంత్రి కోరారు. సమాజ శ్రేయస్సు కోసం ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. టీహెబ్, టీవర్క్స్, వీహబ్ లాంటి సంస్థలు సహకరించేందుకు సిద్దంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement