Friday, November 22, 2024

WGL: నిరుపేద కుటుంబానికి భూమి దానమిచ్చిన యువనేత రాకేష్ రెడ్డి

చిలుపూర్ : ప్రస్తుతమున్న ఈ రోజుల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలం వేలల్లో రేటు పలుకుతుంది. సామాన్యులకు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల్లో చాలా తలకు మించిన భారమవుతోంది. కొంచెం స్థలం కోసం సొంత అన్నదమ్ములనైనా దూరం పెట్టే రోజులివి. ఉన్న భూమిని పంచుకోవడంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. తండ్రి సంపాదించిన ఆస్తిలో కూడా ఆడపడచులు, అన్నదమ్ముల మధ్య చాలా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుల్లో భూముల గొడవలతో బంధాలను తెగతెంపులు చేసుకుని ఎప్పటికి కలవకుండా విడిపోతున్నారు. అలాంటిది రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పూర్తితో సేవాగుణాన్ని అలవర్చుకొని తనకున్న భూమిలో 5గుంటలను తన గ్రామంలో నిరుపేద కుటుంబానికి దానమిచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు ఓ యువనేత.. ఈ సందర్భంగా జిల్లా, మండలం, గ్రామస్తులంతా ఆ యువనేత మానవతా హృదయానికి ఫిదా అయ్యారు. అతను ఎవరో కాదు.. జనగామ జిల్లా చిలుపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి రాకేష్ రెడ్డి..

వివరాల్లోకి వెళితే… చిలుపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువనేత రాకేష్ రెడ్డి.. ఆ యువకుడు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు.. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పూర్తితో అతడు పదిమందికి సహాయం చేయాలనే గుణం అలవర్చుకున్నాడు. ఆ గుణమే ప్రస్తుతం ప్రజలు శ్రీమంతుడు అంటున్నారు..అసలు ఇంతకీ అతను చేసిన మంచి పని ఏమిటంటే.. తమ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొత్తగట్టు అంబదాస్ గత కొన్నిరోజులుగా కిడ్నీ వ్యాధి సమస్యతో తీవ్రమైన ఇబ్బందులు బాధపడుతున్నాడు.. ఇతడికి ముగ్గురు కుమారులున్నారు.. దీంతో వెంటనే యువనేత రాకేష్ రెడ్డి ఏదో ఒక సహాయం చేయాలనే ఆలోచనతో తన భూమిలోని 5గుంటలను ఆ కుటుంబంకు జనగామ జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి చేతుల మీదుగా దానం ఇచ్చాడు.. మొత్తానికి ఈ రోజుల్లో భూమిని దానమిచ్చాడంటే చాలా గొప్ప విషయమని ఊరంతా రాకేష్ రెడ్డిని కొనియాడుతున్నారు. ఈ విధంగా తన గొప్ప మనసు చాటుకున్న రాకేష్ రెడ్డి మంచి పనిపై పలువురు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement