Monday, September 16, 2024

WGL: నిజాయితీగా పనిచేయాలి.. అవినీతికి పాల్పడితే జైలుకే..

చిట్యాల, ఆగస్టు 8 (ప్రభ న్యూస్) : నియోజకవర్గంలోఎలాంటి అవినీతి అక్రమాలు లేకుండా, నిజాయితీగా పరిపాలన అందించాలని, అవినీతికి పాల్పడితే జైలుకు పంపించడం ఖాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో నూతన చైర్పర్సన్, పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎస్ఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వంగా, ప్రజా సేవకుడిగా పరిపాలన చేయడం జరుగుతుందన్నారు. నూతన పాలకవర్గం మూడు మండలాలను రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిజాయితీగా పని చేయాలని కోరారు.

భూపాలపల్లి నియోజకవర్గంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని పైరవీకారులుగా అవతారం ఎత్తి, డబ్బులు తీసుకున్నారని వారు వెంటనే నెల రోజుల్లో బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని, లేకుంటే, అవినీతికి పాల్పడ్డ వారు నాపక్కన ఉన్నవారైనా సరే జైలుకు పంపడం ఖాయమని జీఎస్ఆర్ హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రులను నిద్రపోనివ్వనని, రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి గాజర్ల అశోక్, రామ్ నర్సింహారెడ్డి, సంపత్ రావు చిట్యాల మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ ఎండి రఫీ, కాంగ్రెస్ రాష్ట్ర , జిల్లా, మండల నాయకులు తిరుపతి, కిష్టయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement