Friday, September 6, 2024

WGL: పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యానికి గురైన బాధితులకు రూ.11 లక్షల 81వేల మంజూరైన‌ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి అర్హులైన పేదలకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని అన్నారు.

ప్రజా సంక్షేమం కోసం.. ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకాలకు రూపకల్పన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement