కేసముద్రం: స్మార్ట్ యుగంలో చాలా స్మార్ట్ గా అనుకోకుండా పెళి చేసుకుంది ఓ జంట..వివరాలలోకి వెళితే ఒడిశాకు చెందిన కబీర్దాసు, కవిత కూలీ పనులు చేస్తుంటారు. నిరుపేదలైన ఈ ప్రేమజంటకి మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రవినాయక్ పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారు. తాళ్లపూసపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయానికి అర్చకుడు మరో చోట కార్యం ఉండటంతో రాలేకపోయాడు. దీంతో కౌన్సిలర్ రవినాయక్తో పాటు స్థానికులు మరో అర్చకుడికి ఫోన్ చేశారు. ఆయన లైవ్లో మంత్రాలు చదువుతుండగా ప్రేమజంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇంటర్నెట్ యుగంలో అన్ని ఫోన్ లో చేసుకోవచ్చు అనేందుకు ఈ పెళ్లి కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది..
Advertisement
తాజా వార్తలు
Advertisement