వరంగల్ : ఎవరూ అదైర్య పడవద్దని బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు రాత్రి వరంగల్ నగరంలోని మండిబజార్ లో కూలిపోయిన ఇంటిని, ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదంలో మరణించిన మృతదేహాలను మంత్రి పరిశీలించారు. వారి కుటుంబాలను పరామర్శించారు. మంత్రితో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు, MLAలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో శిధిలావస్థలో ఉన్న 379 ఇండ్లను గుర్తించి యాజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిలో ఇప్పటికే 145 పురాతన ఇండ్లు కూల్చేశాం.. నోటీసులు అందుకున్న యాజమానులు వారే ఇండ్లను తొలగించుకోవాలన్నారు. లేకపోతే GWMC అధికారులే తొలగిస్తారని ప్రజలు సహకరించాలని కోరారు. వర్షాలు, వరదల సమయంలో సెల్ఫీల కోసం, చేపల కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటారు.