Friday, October 4, 2024

WGL: వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. ఎమ్మెల్యే కడియం

ప్రభ న్యూస్, జనగామ : సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ ఎమ్ ఆర్ గార్డెన్ లో మీడియా స‌మావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాల, మాదిగల ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయాలనే డిమాండ్ తో చేపట్టిన ఉద్యమం నిరంతరం కొనసాగినప్పటికీ… ఈ వర్గీకరణ డిమాండ్ సుప్రీంకోర్టులో ఉందని, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు వర్గీకరణకు సానుకూలంగా తీర్పునివ్వడం శుభ పరిణామమ‌న్నారు.

ఈ వర్గీకరణతో అట్టడుగు పేద వర్గాలకు రాబోవు రోజుల్లో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కలిగి వారి కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందుతారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అధికార, ప్రతిపక్ష మేధావులు, ప్రజలు ఏకమై అమలుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, గుడి వంశీధర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, లింగాల గణపురం, మండల అధ్యక్షులు శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement