Saturday, November 23, 2024

గాంధీజీ ఆశయాలను మనమంతా ఆచరించాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను హనుమకొండ – రామ్ నగర్ లోని త‌న నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం హనుమకొండలోని క్యాంపు కార్యాలయం – అర్అండ్ బి అతిథి గృహంలో మంత్రి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను కొనియాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ స్వతంత్ర వేడుక ప్రత్యేకమైనది అన్నారు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి, ఆగస్ట్ 8 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో కచ్చితంగా ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇంటింటా వాడవాడలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాల‌న్నారు. భారత దేశ స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా గ్రామ గ్రామాన, వాడవాడలా.. అద్భుతంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. స్వతంత్ర భారత ఉద్యమ స్ఫూర్తి ని ప్రజలకు తెలియచేయాలి. ఆనాటి ఉద్యమ నేపథ్యం భావి తరాలకు అర్థం అయ్యేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. 16వ తేదీన సామూహిక స్వతంత్ర జాతీయ గీతాలోపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవాలని విజయవంతం చేయాల‌న్నారు. గాంధీజీ ఆశయాలను మనమంతా ఆచరించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేయాలి. మన దేశం మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా మనమంతా కృషి చేయాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement