అభివృద్ధిలో నరేందర్ కు ముందు నరేందర్ తరవాత అనే చర్చ జరగడం సంతోషం ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజవర్గం రంగశాయిపేటలోని ప్రభువైన యేసుక్రీస్తు సంఘం చర్చ్ లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధిలో దుసుకుపోతున్నామని, ముఖ్యంగా 1100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. 7 గురుకులాలు రెండు డిగ్రీ కలశాలలు ఏర్పాటు చేసుకొని పేదలకు నాణ్యమైన విద్య అందిస్తుస్తున్నామన్నారు. అభివృద్ధిలో నరేందర్ కు ముందు నరేందర్ తరవాత అనే చర్చ జరుగుతుందని చర్చ్ పెద్దలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని, నిరుపేదనైన నన్ను కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేస్తున్నానన్నారు. పేదల మధ్య కలెక్టర్ తీసుకొచ్చి వారిని ఆర్థికాభివృద్ధి దిశగా మార్గం చూపబోతున్నామన్నారు. గతంలో తాను మేయర్ గా ఉన్నప్పుడు రామన్నపేటలోని చర్చ్, హన్మకొండలోని సీబీసీ చర్చ్ రోడ్డు వైండింగ్ లో కొంత మేర కూలగొట్టే పరిస్థితి వస్తే దగ్గరుండి పరిష్కారం చూపానని ఎమ్మెల్యే అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సంఘం యొక్క చర్చుకు సైతం నిదులో కేటాయించి అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, క్రిస్టియన్ మత పెద్దలు,అనిల్,ముఖ్య నాయకులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement