Friday, September 6, 2024

Warangal – కుటుంబంపై తల్వార్ లతో దాడి – ఇద్దరి మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు తల్వార్లతో రెచ్చిపోయారు. 16 చింతల తండాలో బానోతు శ్రీనివాస్, బానోతు సుగుణ దంపతులు, వారి కుటుంబ సభ్యులపై తల్వార్లతో నేటి ఉదయం దాడి చేశారు.

నలుగురు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది సుగుణ. తీవ్ర గాయాలతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బానోతు శ్రీనివాస్ మృతి చెందాడు. అతడి కుమారుడు మదన్, కూతురు దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.దాడి ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ దారుణానికి కారణం అదే గ్రామానికి చెందిన మేకల బన్నీ అని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement