Thursday, November 21, 2024

ఆపరేషన్ జంజీర్ ప్రారంభించిన వరంగల్ ట్రాఫిక్ పోలీస్‌

ట్రె సిటీ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో తోపుడు బండ్ల వ్యాపారస్థుల నుండి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తోపుడు బండ్లను నిర్ధిష్ట ప్రాంతంలోనే వ్యాపారం నిర్వహించుకునే విధంగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హైదరాబాద్ తరహలోనే ఆపరేషన్ జంజీర్ నిర్వహణకు ప్రణాళికను రూపొందించారు. ఈ ఆపరేషన్ జంజీర్ లో భాగంగా ఉదయాన్నే చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రోడ్లపైకి వచ్చే తోపుడు బండ్ల వ్యాపారస్తులు తమ తోపుడు బండ్లను రోడ్లపై అటు ఇటు నడిపిస్తూ టాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండేంకుగాను ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు తోపుడు బండ్లుకు చైన్ తలిగించి తాళం వేసి తాళంచేవి ట్రాఫిక్ పోలీసులు తమ వద్దనే భద్రపర్చుకుంటారు. తోపుడు బండ్ల వ్యాపారస్తులు తిరిగి ఇంటి వెళ్ళే సమయంలోనే తోపుడు బండ్లకు ఉన్న తాళాన్ని ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తారు. ఆపరేషన్ జంజీర్ కార్యక్రమాన్ని తొలిసారిగా ఇన్ స్పెక్ట‌ర్ బాబులాల్ ఆధ్వర్యంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ పోచమ్మమైదానంలోని తోపుడు బండ్లకు ట్రాఫిక్ పోలీసులు చైన్ వేసి తాళం చేసారు. ఆపరేషన్ జంజీర్ ఉద్దేశాన్ని వ్యాపారస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐలు రాజబాబు, డేవిడ్, ఆర్.ఎస్.ఐలు, పూర్ణచందర్రెడ్డి, శ్రవణ్ కుమార్, తోపుడు బండ్ల ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, అధ్యక్షుడు ఫక్రుద్దీన్ తో ఇతర వ్యాపారస్థులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement