Monday, November 18, 2024

వరంగల్ జిల్లా.. పట్టపగలు భ్రూణ హత్యలు…?

పట్ట పగలే భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు సమాచారం. వ‌రంగ‌ల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఓ తండాకు చెందిన మహిళకు ఇది వరకే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే 5నెలల క్రితం సదరు మహిళ గర్భం దాల్చడంతో పట్టణ కేంద్రంలోని ఓ ఆసుపత్రి లో మొదటి అభిప్రాయం .. నెక్కొండ లోని ఓ ఆసుపత్రి లో రెండో అభిప్రాయం అనగా గర్భస్థ శిశువు పిండ లింగ నిర్ధారణ చేసుకుని ఆడ శిశువు అని తేల్చుకుని నేడు కడుపు నొప్పి పేరుతో ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. అధికారులు స్పందించి పట్టణ కేంద్రంలోని ఆసుపత్రులను తనిఖీ చేశారు. అబార్షనేనా లేక కడుపు నొప్పి ఆపరేషన్ అనేది తేల్చాల్సి ఉంది.వాస్తవానికి నెక్కొండ, నర్సంపేట పిండ లింగ నిర్ధారణ పరీక్షలకు అధికారుల చోరవతో పెట్టింది పేరులా మారేలా ఉన్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement