వరంగల్ – లాక్ డౌన్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగటంతో పాటు కరోనా నివారణకు వారి భాధ్యత ఎమిటో తెలిసిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. లాక్ డౌన్ దృష్యా వరంగల్ పోలీస్ కమిషనర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారితో పాటు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి వాహనాల్లో ప్రయాణించే వాహనాలపై జరిమానాలు విధించాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. ముఖ్యంగా ప్రధాన రహదారి మార్గాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టు పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు, వాహన చెకింగ్ సమయాల్లో అధికారులు సిబ్బంది తీసుకోవాల్సిన ముందస్తు చర్యలతో పాటు, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలుసూచనలు చేసారు. అదే విధంగా ప్రధాన రోడ్డు మార్గల్లోనే కాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతర మార్గల్లోను ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గత నాల్గు రోజుల నుండి నేటి వరకు రెండువేలకు పైగా కేసులను నమోదు చేయడం జరిగిందని, అదే విధంగా రోజురోజుకి ప్రజల్లో మార్పు కనిపిస్తోందని, లాక్ డౌన్ నిబంధనలను పాటించడంతో పాటు లాక్ డౌన్ మినహయింపు ఇచ్చిన సమయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించడం జరుగుతోందని. ఇదే విధంగా కొనసాగితే మనందరం కల్పి కరోనాను నియంత్రించడం సాధ్యపడుతుందని తెలిపారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, ఎ.ఎస్.పి అభినవ్ గైక్వాడ్, ఎ.సి.పి జితేందర్‌రెడ్డి, గిరికుమార్, గజ్జికృష్ణ, ఇనెన్స్ స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, సతీష్ బాబు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement