Thursday, November 21, 2024

చదివింది కంప్యూటర్ సైన్స్ ఎమ్మెస్సీ .. చేసేది చోరీలు

ఉన్నత చదువులు చదివి చెడు వ్యసనాలకు అలవాటు పడి తాళం వేసి వున్న ఇళ్ల‌ల్లో చోరీల‌కి పాల్ప‌డ్డాడు ఓ యువ‌కుడు.ఈ దొంగ‌ని సిసిఎస్ .. కేయూన్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. నిందితుడి వ‌ద్ద నుండి సూమారు 11లక్షల 50వేల రూపాయల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్ళు, ఒక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డిసిపి మురళీధర్ వివరాలను వెల్లడిస్తూ. పోలీసులు అరెస్టు చేసిన ఎర్రబోతుల సునీల్, తండ్రి పేరు బాబు, వయస్సు 24, మహబూబాద్ జిల్లా, గంగారం మండలం, పెద్దఎల్లాపూర్ ( ప్రస్తుతం జులై వాడ, హనుమకొండలో నివాసం వుంటున్నాడు). నిందితుడు సునీల్ కాకతీయ విశ్వవిద్యాలయములో కంప్యూటర్ సైన్సు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఆన్ లైన్ లో క్రికెట్ తో పాటు ఇతర క్రీడలపై బెట్టింగ్ కి పాల్పడుతూ.. చెడుడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దీనితో పెద్ద మొత్తం డబ్బులు పోగోట్టుకోవడంతో తిరిగి డబ్బును సులభంగా డబ్బును సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు మరో నిందితుడితో కల్సి చోరీలు చేసేందుకు సిద్ధమయ్యాడ‌ని తెలిపారు. నిందితుడిని సకాలంలో పట్టుకోని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన డిసిపి మురళీధర్, క్రైమ్ ఏసిపి డేవిడ్ రాజు, సిసిఎస్, కెయూసి ఇన్స్స్పెక్టర్లు రమేష్ కుమార్, దయాకర్, ఎస్.ఐ రాజేందర్, విజయ్ కుమార్, ఏఏఓ సల్మాన్పషా, హెడాకానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్ళు వంశీ, చంద్రశేకర్, సదానందం, ఎన్.శ్రీకాంత్, వినోద్, నరసింహులు, నజీరుద్దీన్, ఐటీకోర్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement