Saturday, November 23, 2024

సెల్యూట్ టు వరంగల్ పోలీస్ – కర్ఫ్యూ సమయంలో నిండు గర్భిణిని హాస్పిటల్లో చేర్చిన ఇన్స్ పెక్టర్

వరంగల్ క్రైమ్ – వరంగల్ పోలీసులు కర్తవ్య నిర్వహణలోనే కాదు, మానవత్వాన్ని చాటడంలోను ముందున్నారు. ఖాకీలు కర్కశ హృదయులు కాదు, మనసున్న మహానీయులని వరంగల్ పోలీసులు నిరూపించు కొంటున్నారు. ఆదివారం ఆర్థరాత్రి సమయంలో నిండుగర్భిణీ హస్పటల్ లో చేరడం కోసం రోడ్డెక్కింది. కానీ కరోన మహమ్మారి కారణంగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండటంతో వారికి హాస్పిటల్ పోవడానికి ఏ వాహనం దొరకక రోడ్డుపై నిస్సహాయ స్థితిలో సహాయం కోసం గంపడాశతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇంతేజర్ గంజ్ ఇన్స్పెక్టర్ గాండ్ల. వెంకటేశ్వర్లు రాత్రి కర్ఫ్యూ బందోబస్తు నిర్వహిస్తూ అటుగా వచ్చారు. నిండు గర్భిణీ పడుతున్న ప్రసవ వేదనను చూసి, తన పోలీస్ పెట్రో కారులో గర్భిణీ మహిళ, ఆమె పేరెంట్స్ ను తీసుకొని వెళ్లి, హాస్పిటల్లో చేర్చారు. కష్ట సమయంలో అండగా నిలువడమే కాక హాస్పిటల్ సిబ్బందిని అప్రమత్తం చేసి,సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చూసిన ఇంతేజార్ గంజ్ ఇన్స్ పెక్టర్ వెంకటేశ్వర్లుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సంఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం ఆర్థరాత్రి సమయంలో కాశిబుగ్గ ప్రాంతంలో పురిటి నొప్పులతో నిండు గర్భిణీ తల్లడిల్లుతున్నది. సదరు గర్భిణీ మహిళ తన తల్లిదండ్రులతో కల్సి హస్పటల్ కు వెళ్ళేందుకు రోడ్డుపైకి వచ్చి వాహనం కోసం ఎదురు చూస్తూన్నారు.రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు వల్ల వారికి ఎలాంటి వాహనం దొరకక, నిండుగర్భిణీ రోడ్డుపైనే నిలబడి యాతన పడుతున్నది. సరిగ్గా అదే సమయంలో పెట్రొలింగ్ నిర్వహిస్తున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెకర్ వెంకటేశ్వర్లు అటుగా రావడం విషయం తెలుసుకుని రొడ్డుపై వేచివున్న గర్బవతిని హుటాహుటిన ప్రసూతి ఆసుపత్రి కి చేర్చారు. ఆమెతో ఆమె రక్తసంబంధికులను తన పెట్రోకారులో సి.కె.యం ప్రసూతి హస్పటల్ కు తరలించి, సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చూశారు. తన బిడ్డను హస్పటల్ తరలించి సహాయసహకారాలు అందించిన ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుకు,సమస్త వరంగల్ పోలీసులకు సదరు గర్భిణీ మహిళ ,ఆమె బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్ పోలీసులు కర్ఫ్యూ సమయంలో మానవత్వం చూపుతూ పని చేస్తుండటాన్ని వరంగల్ వాసులు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement