Monday, November 18, 2024

కేటీపీపీ గేటు ముందు గ్రామస్తుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..

గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారు కేటిపిపి నిర్వాసిత గ్రామం దుబ్బపల్లి గ్రామస్తులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందజేసి గ్రామాన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండవ గేటు ఎదురుగా ధర్నాకు దిగారు. మంగళవారం సాయంత్రం కేటీపీపీ పర్యటనకు వచ్చిన జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కాన్వాయిని దుబ్బపల్లి భూ నిర్వాసిత గ్రామస్తులు అడ్డుకున్న విషయం విధితమే. కాగా బుధవారం ఉదయం గ్రామస్తులతో చర్చిస్తానని హామీ ఇచ్చిన సీఎండీ ప్రభాకర్ రావు మరో గేటు నుండి హైదరాబాద్ కు వెళ్లిపోవడంతో కోపోద్రిక్తులైన దుబ్బపల్లి నిర్వాసిత గ్రామస్తులు రెండవ గేటు ముందు ధర్నాకు దిగారు. దీంతో కేటీపీపీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చిట్యాల సీఐ పులి వెంకట్ ఆధ్వర్యంలో ఎస్సై అభినవ్ దుబ్బపల్లి గ్రామస్తులను పోలీస్ వాహనాల ద్వారా పోలీస్ స్టేషన్ కు తరలించగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. భారీ పోలీసు బలగాలు మోహరించి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించగా వారిని వదిలి పెట్టాలంటూ మిగతా గ్రామస్తులు కాలినడకన పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement