Saturday, September 14, 2024

WGL: గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 కేజీల గంజాయి స్వాధీనం

భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు
ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవినగర్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని 2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో గురువారం భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

గురువారం ఉదయం 6.30 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు సూచనతో చిట్యాల సీఐ డి.మల్లేశ్ పర్యవేక్షణలో ఘనపూర్ ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి రవి నగర్ గ్రామం వద్దకు వెళ్లి వాహనాలు తనిఖీ చేయడంతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో‌ ఆటోలో వెళ్తున్నట్లు గుర్తించారు. వారి ఆటోని ఆపి వెతకగా డ్రైవర్ కూర్చునే సీటు కింద పసుపు రంగు కవర్ లో దాదాపు 2కేజీల గంజాయి కనిపించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

వీరు సంపాదించే డబ్బులు వారి జల్సాలకు సరిపోకపోవడంతో గత కొద్ది రోజులుగా ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో కొండ పరివాహక ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుక్కొని వచ్చి ఆ గంజాయిని భూపాలపల్లి, గణపురం మండల పరిసర ప్రాంతాల్లో గంజాయి అలవాటు ఉన్నవారికి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని, అలా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారని విచారణలో ఒప్పుకున్నారు.

- Advertisement -

పంచనామా నిర్వహించి సీజ్ చేసిన రెండు కేజీల గంజాయిని ఆటో, ఇద్దరు వ్యక్తులు దాసరి రాములు, మిట్టపెల్లి నిశాంత్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్ రావు మాట్లాడుతూ… గంజాయి నియంత్రణకు ప్రజలు సహకరించాలని, గంజాయికి సంబంధించిన ఏ సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా కానీ స్థానిక పోలీసు అధికారికి చేరవేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement