Monday, November 25, 2024

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల్లో బీసీలకు, మ‌హిళ‌ల‌కు టిఆర్ఎస్ పెద్ద పీట – మంత్రి ఎర్ర‌బెల్లి

జ‌న‌ర‌ల్ సీట్ల‌ల్లోనూ 11 మంది బీసీల‌కు అవ‌కాశం
జ‌న‌ర‌ల్ మ‌హిళ సీట్ల‌ల్లో 8 మంది బీసీ, ఎస్సీ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం
అన్ని వ‌ర్గాల‌తోపాటు బీసీల‌కు మంచి అవ‌కాశాలు టిఆర్ఎస్ తోనే

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ బీసీల‌కు పెద్ద పీట వేసింది. రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం వారికి కేటాయించిన సీట్ల‌ను వారికి ఇవ్వ‌డ‌మే గాక‌, అద‌నంగా జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ బీసీలు, బీసీ, ఎస్సీ మ‌హిళ‌ల‌కు 19 స్థానాల‌లో అవ‌కాశం క‌ల్పించారు. మొత్తం 66 డివిజ‌న్ల‌లో 11 మంది బీసీ పురుషులు, 7 గురు బీసీ మ‌హిళ‌లు, 1 ఎస్సీ మ‌హిళ‌కు జ‌న‌ర‌ల్ స్థానాల్లో అవ‌కాశం టిఆర్ఎస్ క‌ల్పించింది. జ‌న‌ర‌ల్ పురుషుల స్థానాలుగా ఉన్న‌4వ డివిజ‌న్ లో యాద‌వ‌కు, 5వ డివిజ‌న్ లో ఉప్ప‌ర‌, 7వ డివిజ‌న్ లో ప‌ద్మ‌శాలి, 31వ డివిజ‌న్ లో మున్నూరు కాపు, 61వ డివిజ‌న్ లో నాయీ బ్రాహ్మ‌ణ‌, 45వ డివిజ‌న్ లో ముదిరాజ్, 56వ డివిజ‌న్ లో మున్నూరు కాపు, 66వ డివిజ‌న్ లో వారాల‌, 27వ డివిజ‌న్ మున్నూరు కాపు, 35వ డివిజ‌న్ లో మున్నూరు కాపు, 60 వ డివిజ‌న్ లో మున్నూరు కాపుల‌కు అవ‌కాశం క‌ల్పించారు.
జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల స్థానాల్లో 58 వ డివిజ‌న్ లో మాదిగ‌, 63వ డివిజ‌న్ లో ముదిరాజ్, 55వ డివిజ‌న్ లో యాద‌వ, 24వ డివిజ‌న్ లో మ‌న్నూరు కాపు, 50వ డివిజ‌న్ లో ఉప్ప‌ర‌, 59, 19వ డివిజ‌న్ ల‌లో మున్నూరు కాపుల‌కు టిఆర్ ఎస్ అవ‌కాశం క‌ల్పించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, ఇప్పుడున్న సో కాల్డ్ పార్టీల‌కు భిన్నంగా టిఆర్ఎస్ పార్టీ బ‌డుగుల ప‌క్ష‌పాతిగా ఉంద‌న్నారు. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం ద‌క్కాల్సిన‌వి ద‌క్క‌గా, అద‌నంగా 18 డివిజ‌న్ల‌లో బీసీల‌కు, 1 డివిజ‌న్ లో ఎస్సీ మ‌హిళ‌కు అవ‌కాశం క‌ల్పించిన ఘ‌న‌త టిఆర్ ఎస్ దే అన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల ఆదేశానుసారం పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం జ‌రిగింద‌ని, వాళ్ళంద‌రినీ గెలిపించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement