తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై టెంటు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో పండించిన ధాన్యాలను కేంద్రం ఎలా కొనుగోలు చేస్తుందో తెలంగాణలో కూడా అదేవిధంగా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి మోడీ ఓర్వలేకనే వివక్ష చూపుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement