వరంగల్ – రంగ శాయి పేట – వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీ ఆర్ ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం వరంగల్ తూర్పు నియజకవర్గ జాగృతి నాయకుడు , వ్యాపారవేత్త, 32వ డివిజన్ టీ ఆర్ ఎస్ పార్టీ నాయకుడు సింగరి రాజ్ కుమార్ తన అనుచరులతో కలిసి హన్మకొండ రాం నగర్ లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు.. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ,. తెలంగాణా ఉద్యమం సమయం నుండి ఉన్న నాయకులను కాదని ఎమ్మేల్యే నరేందర్ మొన్న వచ్చిన వారికీ టికెట్ ఇస్తున్నరని ఆరోపించారు. ఉద్యమం చేసినా వారికీ మొండి చెయ్యి చూపుతున్నారని ఎమ్మేల్యే పై మండి పడ్డారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు నల్లగొండ రమేశ్, కరాటే ప్రభాకర్ తదతరులు పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement