నర్సింహులపేట, (ప్రభన్యూస్) – హైవేలపై లారీలను బలవంతంగా ఆపి ధాన్యాన్ని తరలించడానికి అధికారులు నానా పాట్లు పడుతున్నారు.ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల స్టేజి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.రాష్ట ప్రభుత్వం రైతుల మేలు కొరకు దళారులకు విక్రయించకుండా పండించిన ధాన్యం సరైన మద్దతు ధర గిట్టుబాటు కావాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.కాంటాలు నిర్వహించి కేంద్రాల నుండి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలి.మిల్లు యజమానులు పలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలి ఇక్కడ మిల్లర్లు ధాన్యాన్ని నిరాకరించి వచ్చిన వాహనాన్ని రోజుల తరబడి దిగుమతి చేసుకోకపోవడంతో లారీ యజమానులు రవాణాకు నిరాకరిస్తున్నారు.
దీంతో కేంద్రాల వద్ద ధాన్యం నిలువలు పేరుకుపోయాయి.పది రోజుల క్రితమే కాంటాలు నిర్వహించినప్పటికీ మిల్లులకు ధాన్యాన్ని ఎందుకు తరలించడం లేదని ఐకెపి సెంటర్ల నిర్వాహకులతో రైతులు బుధవారం వాగ్వాదం చేయడంతో నిర్వాకులు రైతుల సమస్యలపై అధికారులకు తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి ఉన్నతాధికారుల ఆదేశాలతో మండల రెవిన్యూ తహశీల్దార్ వివేక్ స్థానిక పోలీసులు కలిసి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వచ్చే పోయే ఖాళీగా వెళ్లే లారీలను ఆపి ధాన్యాన్ని తరలించడానికి రోడ్డుపైనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు.ఇంత జరుగుతున్నా పాలకులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కనీసం కోనుగోలు కేంద్రాలపై కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.