Saturday, November 23, 2024

జర్నలిస్టుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : అల్లం నారాయణ

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్టులకు రెండు రోజులు నిర్వహించే శిక్షణ తరగతులను శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జర్నలిస్టులకు తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ప్రతి జర్నలిస్ట్ ఈ శిక్షణ తరగతులు సధ్వినియోగం చేసుకుని నైపుణ్యాలను మెరుగుపర్చు కోవాలన్నారు. నైతికత ఉన్న జర్నలిస్ట్ ఉత్తమ జర్నలిస్ట్ గా ఎదుగుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, స్థానిక మున్సిపల్ చైర్మన్ వెంకటరాని, గ్రంథాల చైర్మన్ బుర్ర రమేష్ , కల్లెపు శోభ, నారాయణరెడ్డి, డిపిఆర్ ఓ లు శ్రీధర్, లక్ష్మణ్, శంకర్ రావు, విష్ణువర్ధన్ , మెండు రవీందర్, లెనిన్ , తడుక రాజ్ నారాయణ తరగతుల శిక్షకులు బుచ్చయ్య‌, మల్లేశం , వివిధ జర్నలిస్ట్ సంఘాల యూనియన్ బాద్యులు, నాయకులు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement