రేగొండ, జూన్ 13 (ప్రభ న్యూస్) : రేగొండ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి సముద్రాల సురేష్- పద్మావతిల ఇంట్లో దొంగలు పడి తొమ్మిది 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదు అపహరించారు. సముద్రాల సురేష్ మూడు రోజుల క్రితం హైదారాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి ఇంటి తాళాలు పగులకొట్టి ఇంట్లో బీరువాలో దాచుకున్న తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, ఐదు వేల రూపాయల ఎత్తుకెళ్లారు.
సురేష్ ఉదయం ఊరి నుండి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉండటoతో ఆందోళనకు గురై సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా స్టేషన్ ఏఎస్ఐ ఓం పాల్, భూపాల్పల్లి క్లూస్ టీమ్ సమాచారం అందించడంతో క్లూస్ టీమ్ సీఐ రాజ్ కుమార్ దొంగతనం వివరాలు సేకరిస్తున్నారు.