Wednesday, November 6, 2024

నాపై కుట్ర జ‌రిగింది.. కచ్చితంగా పోటీలో ఉంటా: రేఖానాయక్

బీఆర్‌ఎస్‌లో మహిళలకు టిక్కెట్ల పంపిణీలో తీరని అన్యాయం జరిగిందని, ఓ బంజార మహిళగా తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా కుట్ర చేశారని, క‌చ్చితంగా పోటీలో ఉంటానని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆరు నెలల నుంచే తన మీద కుట్ర జరుగుతుందన్నారు. తాను ఎలాంటి భూకబ్జాలు, అవినీతికి పాల్పడలేదని, తనను కాదని ఎస్టీ కాని, నియోజకవర్గానికి సంబంధమే లేని వ్యక్తికి టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

తొమ్మిదేళ్లుగా ఎల్లప్పుడు తాను ప్రజల మధ్యనే ఉన్నానని, తనకు జరిగిన అన్యాయన్ని ప్రజలందరికీ వివరించి ఖానాపూర్‌ లో తన సత్తాను చాటుతానని రేఖానాయక అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే విషయం త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ముత్యం సతీష్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement