Saturday, September 7, 2024

WGL: బైక్ ను ఢీ కొట్టిన ఆర్డీవో వాహనం.. ఇద్దరి పరిస్థితి విషమం

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల – భూపాలపల్లి జాతీయ రహదారి కొంపల్లి క్రాస్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ వైపు నుండి భూపాలపల్లి వైపు వస్తున్న భూపాలపల్లి ఆర్డీవో వాహనం ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వున్న పిల్లోనిపల్లికి చెందిన పర్శ సంపత్, కొంపల్లికి చెందిన సడాలా ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషంగా ఉంది. క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గణపురం ఎస్సై సాంబమూర్తి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement