నెక్కొండ, (ప్రభ న్యూస్): వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని మూడుతండా గ్రామానికి చెందిన భూక్య వీరన్న ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టింది. చెన్నారావుపేట మండలం లింగగిరి శివారులో 11కేవీ విద్యుత్ లైన్ మరమ్మతు పనులలో రోజువారీ కూలీగా వెళ్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం విద్యుత్ స్తంభం ఎక్కి రిపేర్లు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు.
దీంతో స్తంభం పైనుంచి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్ర గాయాలు కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగానే వీరన్నకు విద్యుత్ షాక్ కొట్టిందని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.