Friday, November 22, 2024

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. ఎమ్మెల్యే సీత‌క్క

గోవిందారావుపేట, మార్చి 21 (ప్రభ న్యూస్) : జిల్లాలోని మండలం మచ్చాపూర్ గ్రామంలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంట పొలాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… ములుగు నియోజక వర్గంలో గత 4రోజులుగా కురిసిన వడగండ్ల వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో వరి, మొక్కజొన్న, మిరప తోటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో ఆశలతో అరుగాలం కష్టించి పండించిన పంటలపై వరుణదేవుడు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లాడన్నారు.

వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. చేతికొచ్చే పంట నీటిపాలవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ.20 వేలు అందించాలని, రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని సీతక్క అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement