వెంకటాపూర్ : రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవుసం బాగు పడ్డ చరిత్ర లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట, రామంజాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పేద ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. యాసంగి వరి వెయ్యద్దు.. వరి వేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి వేసిండు అని తెలంగాణ రైతులకు ఒక న్యాయం కేసీఆర్ కు ఒక న్యాయమా… వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మూలాన సాగు భూములు బీడు భూములుగా మారిన పరిస్థితి ఉందని సీతక్క అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలి.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సీతక్క అన్నారు. అనంతరం రామప్ప రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement