Wednesday, November 20, 2024

బరాబర్ రాజ్యాంగాన్ని మార్చాలి : ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి

జనగామ : కేంద్ర ప్రభుత్వం చట్టాల హక్కుతో తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య‌ సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అందుకే హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించుకొని బరాబర్ రాజ్యాంగాన్ని మార్చాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు..మంగళవారం జనగామ జిల్లా గానుగు పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంపై హక్కుల పేరుతో కేంద్ర ప్రభుత్వం అన్యాయానికి గురి చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేయడం రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వకుండా కాలయాపన చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఒకనాడు జనగామ ప్రాంతం సాగు, త్రాగునీరు కోసం అన్నమో రామచంద్రా అని అనేవారని… ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో జనగామ ప్రాంతానికి నిరంతరం సాగు త్రాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పేద, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు పోవడం జరుగుతుందన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం మద్దతు ధరకు అమ్ముకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బాల్దే విజయ, ఎంపీపీ జయమేకల కళింగరాజు, ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ మధుమోహన్, ఎమ్మార్వో రవీందర్, ఎంపిటిసి పద్మ బాలస్వామి, మహేందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement