వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రికార్డులను పరిశీలించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై వారిని ప్రశ్నించారు. గదులు పరిశుభ్రంగా లేకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, కనీస మౌలిక వసతులు లేకపోవడాన్ని పరిశీలించారు.
ఈ విషయమై నిర్వాహకులను మందలించగా, సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం విశేషం. డాక్టర్లను రోజువారీగా వస్తున్నారా..? అంటూ ప్రశ్నించడంతో పాటు ఒకవేళ రెగ్యులర్ గా వచ్చినట్లయితే ఈ పరిసరాలు ఇంత అపరిశుభ్రంగా ఉండేవి కాదని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అసలు ఉపయోగంలో ఉందా లేదా అన్న విధంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెంట అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.