Tuesday, November 26, 2024

గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం – ఎస్పీ జె.సురేందర్ రెడ్డి

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాడమే లక్ష్యమ‌ని జిల్లా ఎస్పీ జే.సురేందర్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్పీ జె.సురేందర్ రెడ్డి పొలీస్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాదక ద్రవ్యాల రవాణా, స్మగ్లర్లను గుర్తించుట, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల పట్ల, పాత నేరస్తుల పట్ల నిఘా, వివరాలు సేకరించినట్లు తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నందున మాదకద్రవ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశముండ‌డం వ‌ల్ల మాదక ద్రవ్యాల రవాణా కట్టడికి చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో గంజాయి నిర్మూల‌న‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… ప్రజల భాగస్వామ్యంతోనే మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోగలమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని వారికి అవగహన కల్పించాలన్నారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించాలన్నారు. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువతను, ప్రజలను రక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. గంజాయి త్రాగే యువకులఫై గట్టి నిఘా పెట్టాలని, వారికి కౌన్సిలింగ్ చేయాలన్నారు. వీటిపై సమాచారం అందించిన వారికీ తగిన బహుమతులు అందిస్తామని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు, అవార్డులు అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు, డీఎస్పీ సంపత్ రావు, బోనాల కిషన్, సిఐలు వేణు, వాసుదేవరావు, కిరణ్ కుమార్, రంజిత్ రావు, ఆర్ఐ సతీష్, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement