Thursday, July 4, 2024

TG | వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు..

హనుమకొండ బాల సముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి అనుమతులు లేవంటూ హనుమకొండ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులకు నోటీసులు జారీ చేశారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు.

బీఆర్ఎస్ ఆఫీస్‌ కేటాయింపు కాపీలు వెరిఫికేషన్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతి, భూమి కేటాయింపు కాపీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆర్డీవోను ఆదేశించారు. బీఆర్ఎస్‌ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌కు సైతం ఈ ఇష్యూలో మున్సిపల్ అధికారులు నోటీసులు పంపించారు. ఈ భవనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ సమర్పించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement