భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను తెలంగాణ రాష్ట్రానికి నాలుగు దిక్కులు ఉన్న రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం టేకుమట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి సంబంధించిన 33 మంది లబ్ధిదారులకు రూ.3 3లక్షల విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహారాష్ట్రలో ఉన్న పలు రాజకీయ పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం కోసం ముందుకు వస్తున్నారు. వ్యవసాయం దండగ అన్న పరిస్థితి నుంచి ఒక పెద్దf పండగల వ్యవసాయం తెలంగాణలో జరుగుతుంది. గత ప్రభుత్వాల హయాంలో కేవలం 4 నుంచి 7 గంటల విద్యుత్ సరఫరా మాత్రమే ఉండేది. నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఏ విధమైన అంతరాయం లేకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేశారు. రేపు హైదరాబాద్ వేదికగా దేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ఈ కార్యక్రమంలో అందరం పాల్గొనాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గౌరవించుకునే కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ధన్యవాదాలు తెలిపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పిటిసి తిరుపతిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి ,ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.