తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వరంగల్ – హనుమకొండ – హంటర్ రోడ్డు – శాయంపేట సర్కిల్ లో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి ఐలమ్మఅన్నారు. అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నది. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement