Saturday, November 23, 2024

దేశంలోనే ఉత్త‌మ గ్రామ పంచాయ‌తీలు క‌ల్గిన రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే పెద్ది

వ‌రంగ‌ల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నేడు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నరావుపేట మండలం అమీనాబాద్ గ్రామం నందు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు అమీనాబాద్ గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై, సమస్యలపై అధికారులతో, ప్రజాప్రతినిధులతో చర్చించడం జరిగింద‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ వాటి అభివృద్ధికై కృషి చేస్తుంద‌న్నారు. ముఖ్యంగా గ్రామాలలో బిటి లింకు రోడ్లు, అంతర్గత సిసి రోడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, రైతు వేదికలు, సాగునీరు, త్రాగు నీరు లాంటి మౌలిక వసతులు కల్పించి దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలు కల్గిన రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందింద‌న్నారు. అందులో భాగంగా అమీనాబాద్ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, గ్రామ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అధిక నిధులను కేటాయిస్తూ మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వీటితో పాటు మహిళా భవనం, ఆరోగ్య ఉప కేంద్రం, 20 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం, వాటర్ ట్యాంక్, గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అమీనాబాద్ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ అభివృద్ధికై కృషి చేస్తున్న ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ వారిని స్థానిక సర్పంచ్ సిద్దన రమేశ్ శాలువాతో సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిపి, జెడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసి, సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్, ఆర్ ఎస్ ఎస్ కన్వీనర్, సంబంధిత అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, క్లస్టర్ భాద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement