ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం వైభవోపేతంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్ భవేష్ మిశ్రా , ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు.
- Advertisement -
అనంతరం.. జయశంకర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి కలెక్టరేట్ కు చేరుకున్న కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలపన చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.