Friday, September 13, 2024

WGL: టేకుమట్ల – రాఘవరెడ్డిపేట బ్రిడ్జిని పున:ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

టేకుమట్ల, సెప్టెంబర్ 4(ప్రభన్యూస్) : భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల – రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగుపై పున: నిర్మాణమైన హైలెవల్ వంతెనను బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.

ఈసందర్బంగా ఎమ్మెల్యే జీ.ఎస్.ఆర్ మాట్లాడుతూ… గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు టేకుమట్ల – రాఘవరెడ్డిపేట వంతెన పిల్లర్లు కుంగినట్లు తెలిపారు. ఆరోజు వంతెనను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలను పంపగా, రూ.4.70 కోట్లతో యుద్ధప్రాతిపదికన వంతెన పున:నిర్మాణ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అతి తక్కువ సమయంలోనే వంతెన నిర్మాణంను పూర్తి చేసిన సదరు గుత్తేదారు(శ్రీ వేంకటేశ్వర కన్ స్ట్ర‌క్షన్)కు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో టేకుమట్ల మండలంలోని వాగవతలి సుమారు తొమ్మిది, పది గ్రామాలకు మార్గం సుగమమైనట్లు తెలిపారు.

కళ్యాణలక్ష్మీ చెక్కుల అందజేత…
టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 15మంది కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.15,01,740 విలువ గల చెక్కులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణలక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రజా ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే అందుతుందన్నారు.

- Advertisement -

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లకు భారం తగ్గిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, ఆడెపు సంపత్, బండ శ్రీకాంత్, కొయ్యల చిరంజీవి, వంగ నరేష్, ఆర్ఎన్జి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement