తొర్రూరు టౌన్ – గత పదినెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రోడ్డున పడేస్తుందని తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఉపాధ్యాయులు అధ్యాపకులు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఉపాధ్యాయులు అధ్యాపకులు సుమారుగా 200 మంది బడులు తెరవాలని మంగళ వారం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ..బార్ల లో లేని కరోనా బడులలోనే ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడులు కళాశాలలు లేకపోవడంతో ఇప్పటికే పదినెలలుగా జీతాలు లేక ప్రైవేట్ టీచర్ లు లెక్చర్స్ ల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. ఫిబ్రవరి లో పునఃప్రారంభించిన కొన్ని రోజులకి కరోనా ప్రభావంతో మూసివేయడం ప్రైవేట్ టీచర్ లు అధ్యాపకుల కుటుంబాలు తిరిగి రోడ్డున పడ్డాయన్నారు. . కోవిద్ టీకా అందుబాటులో వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ,కళాశాలలు పునఃప్రారంభించాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement